రేపు వైఎస్ జయంతి( YS Jayanthi ) సందర్భంగా వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల,( YS Sharmila ) వైయస్ విజయమ్మ…కుటుంబ సభ్యులు ఇడుపులపాయకి( Idupulapaya ) చేరుకున్నారు.హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడ నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది.అక్కడ తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగముని రెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.

ఆ తర్వాత వేంపల్లి రిజిస్ట్రేషన్ నుంచి షర్మిల కుటుంబ సభ్యులు ఇరుకులపాయ ఎస్టేట్ కి చేరుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం వైయస్ జయంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద వైయస్ షర్మిల మరియు విజయమ్మ నివాళులర్పించనున్నారు.అనంతరం ప్రతి ఏడాది నిర్వహించినట్లే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో షర్మిల తండ్రి వైయస్ జయంతి నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.







