అన్ని లావాదేవీలు పేమెంట్ యాప్స్ తో చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ..!

భారతదేశంలో దాదాపుగా క్యాష్ ట్రాన్సాక్షన్లు కరోనా వచ్చాక తగ్గిపోయాయి.ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే చిన్న దుకాణం నుంచి పెద్దపెద్ద నగరాలలో ఉండే సిటీ మాల్స్ వరకు అన్ని ఆన్లైన్ పేమెంట్ జరుగుతున్నాయి.

 Are You Doing All The Transactions With Payment Apps.. If You Do These Mistakes-TeluguStop.com

ఆన్లైన్ రంగంలో యూపీఐ ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.యూపీఐ, బ్యాంక్ అకౌంట్ల మధ్య ఇన్స్టంట్, కన్వీనియెంట్ ట్రాన్సాక్షలను అందిస్తోంది.

అయితే చాలామంది వినియోగదారులు తెలియక చేస్తున్న కొన్ని తప్పుల వల్ల హ్యాకర్ల, స్కామర్ల బారిన పడి బ్యాంక్ ఖాతా ఖాళీ చేసుకుంటున్నారు.ఆన్లైన్ పేమెంట్ చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

అవి ఏమిటంటే.

యూపీఐ యాప్( UPI app ) కు లాక్ ను పాస్వర్డ్ కాకుండా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అథెంటికేషన్ సెక్యూరిటీ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి.

ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్లను గుర్తించేందుకు తరచూ బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేస్తూ
ఉండాలి.ఏదైనా అనుమానం వస్తే వెంటనే సంబంధిత బ్యాంకు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కి ఫిర్యాదు చేయాలి.

Telugu Bank, Latest Telugu, Security, Upi App-Latest News - Telugu

యూపీఐ యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.లేటెస్ట్ వెర్షన్ ఉంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది.అప్డేట్ చేసుకుంటే సెక్యూరిటీ ప్యాచ్లు, బగ్ ఫిక్సెస్ ను అందిస్తాయి.ట్రాన్సాక్షన్లకు( Transactions ) సంబంధించిన ఐడీలు, తేదీలు, అమౌంట్ వివరాల రికార్డును మెయింటైన్ చేయాలి.ఏదైనా వివాదాల విషయంలో ఇవి ప్రూఫ్ గా ఉపయోగపడతాయి.

Telugu Bank, Latest Telugu, Security, Upi App-Latest News - Telugu

యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేముందు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో సరి చూసుకోవాలి.ఇంటర్నెట్ కనెక్షన్( Internet connection ) వీక్ గా ఉంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.విమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి, ఫిషింగ్ మెసేజ్ లు, ఈమెయిల్ లేదా బ్యాంక్ ప్రొవైడర్ గా నటించే కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube