గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
కాగా పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సూరత్ ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది.మరోవైపు సెషన్స్ కోర్టులోనూ, గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ గాంధీకి ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.







