సుద్దతో అద్భుతం చేసిన మహిళ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

పాత కాలంలో కొంతమంది సాధువులు అతీత శక్తులు కలిగి ఉండేవారు.వీళ్లు ఎవరికీ సాధ్యం కాని అనేక పనులు చేస్తుండేవారు.

 A Woman Who Has Done A Miracle With Chalk, Woman, Talent, Viral Latest, News Vi-TeluguStop.com

తమ టాలెంట్‌తో ఎంతమందిని ఆకట్టుకునేవారు.తమ సాహసాలు, విన్యాసాలతో అందరినీ ఆశ్చపరిచేవారు.

అయితే ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది తమలోని టాలెంట్ ను బయటపెడుతూ పాపులర్ అవుతున్నారు.తమలోని ప్రతిభతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

వీరిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతూ ఉంటుంది.ఇందులో ఒక మహిళ టాలెంట్ కు అందరూ అవాక్కవుతున్నారు.ఈమె వెనక్కి చూడకుండా చిత్రాలను గీస్తుంది.

ఇటీవల బజరంగబలి( Bajrangbali ) అనే చిత్రాన్ని రూపొందించింది.ఇందుకోసం తన రెండు చేతుల్లో సుద్ద పట్టుకుంది.

సుద్దలతో( chalks ) వెనుకకు అసలు చూడకుండా వెనుక ఉన్న నల్లటి కాన్వాస్‌పై రెండు చేతులతో బజరంగబలి ఫొటోను రూపొందించింది.ఇందుకోసం ఒక్కసారి కూడా ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.

అసలు చూడకుండానే చాలా అద్భుతంగా బజరంగబలి చిత్రాన్ని ఈ మహిళ గీసింది.పూనమ్ ఆర్ట్ అకాడమీ( Poonam Art Academy ) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ మహిళ వీడియోను పోస్ట్ చేశారు.చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.మహిళ టాలెంట్‌కు అందరూ అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ పోస్ట్‌కు లైక్‌లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.ఇప్పటివరకు లక్షకుపైగా వ్యూస్ రాగా.88 వేలకుపైగా లైక్ లు వచ్చాయి.చాలామంది జై శ్రీరామ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

ఈమెలోని టాలెంట్‌ను చూస్తే సెల్యూట్ చేయాలని అనిపిస్తుందని కొంతమంది కామెంట్లు పెడుతుండగా.మరికొంతమంది ఇలాంటి వారిని ప్రోత్సహించాలని చెబుతున్నారు.

ఈ మహిళకు ఆర్ట్ ఇన్ మై లైఫ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube