Nithiin : ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హీరో నితిన్ అంటూ వార్తలు.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ హీరో నితిన్ ( Nithin )గురించి మనందరికీ తెలిసిందే.నితిన్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ కావడం లేదు.

 Crazy Buzz Hero Nithin Into Politics-TeluguStop.com

నితిన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.ఈ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు.

నితిన్ హిట్ సినిమా చూసి చాలా కాలం అయింది అని చెప్పవచ్చు.ఒక్క సినిమా హిట్ అయింది అంటే వరుసగా ఐదారు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

సినిమాలలో అయితే నటిస్తున్నాడు కానీ, ఆ సినిమాలు మాత్రం ఆశించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.

Telugu Congress, Nagesh Reddy, Nithin, Nizamabad, Revanth Reddy, Tollywood-Movie

ఇటువంటి నేపథ్యంలోనే నితిన్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో, కాంగ్రెస్ పార్టీ ( Congress party )తరఫున నితిన్ పోటీ చేయబోతున్నారని, నిజామాబాద్ కు చెందిన నితిన్ రూరల్ నియోజకవర్గం పై కన్నేసినట్టు తెలుస్తోంది.రూరల్ సీట్ పై కన్నేశాడని అక్కడినుంచి పోటీ చేయాలని నితిన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ మేరకు రాజకీయ, సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.అటు సినిమా ఇటు రాజకీయాల్లో ఏక కాలంలో రాణించాలని అనుకుంటున్నాడట నితిన్.

Telugu Congress, Nagesh Reddy, Nithin, Nizamabad, Revanth Reddy, Tollywood-Movie

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక వర్గం వారు ఆ వార్తలను కొట్టి పాటిస్తూ అవన్నీ ఫేక్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నితిన్ తన బంధువుల కోసం టికెట్ ప్రయత్నాల్లో ఉన్నాడని అంటున్నారు.నితిన్ మేనమామ నాగేష్ రెడ్డి ( Nagesh Reddy )చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు.ఆయన పదేళ్లకు పైగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారట.ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు.

సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారట.మేనమామ నగేష్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు నితిన్ ప్రయత్నాలు చేస్తున్నారట.

ప్రత్యక్షంగా ఆయన పోటీ చేసే అవకాశం లేదంటున్నారు.మరి ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాలి అంటే హీరో నితిన్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube