పెళ్లిచూపులు( Pelli Chupulu ) సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ( Tarun Bhaskar ) .ఇలా మొదటి సినిమాతోనే దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు కాస్త తగ్గించారని చెప్పాలి.తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించకుండా ఇతర డైరెక్టర్లు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాలలో నటిస్తూ కనిపిస్తున్నారు.
ఈయనకు నటనపై ఆసక్తితో ఇలా చేస్తున్నారా లేక డైరెక్టర్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇలా నటిస్తున్నారనేది తెలియదు కానీ ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడానికి తరుణ్ భాస్కర్ ఆసక్తి చూపుతున్నారు.

ఇదివరకే పలు సినిమాలలో నటించిన ఈయన సీతారామం( Sitaramam ) సినిమాలో బాలాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇకపోతే తాజాగా తరుణ్ భాస్కర్ గెస్ట్ రోల్ చేసిన కోడా కోలా( Coda Cola ) అనే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా క్రైమ్ అండ్ కామెడీ త్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
అలాగే కూల్డ్రింక్స్ తయారీ కంపెనీకి పురుగుల మందు తయారీ కంపెనీకి మధ్య ఏదో కనెక్షన్ ఉందని ఈ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది.

మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తరుణ్ భాస్కర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విడుదలై ఏ సినిమా పోస్టర్ లో ఒక గన్ను కనిపించిన ఇది ఫలానా పోలీస్ కథతో వచ్చిన సినిమా నుంచి కాపీ కొట్టారని వార్తలు సృష్టిస్తారు.అలాగే బ్యాట్ కనిపిస్తే చాలు జెర్సీ సినిమా నుంచి కాపీ అంటూ వార్తలు సృష్టిస్తారు.
అనవసరంగా ఇలాంటి కామెంట్స్ చేసే హౌలే గాళ్లందరిని మస్తు కొట్టాలనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.