నిహారిక చైతన్య విడాకుల విషయంలో షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రియా చౌదరి?

మెగా డాటర్ నిహారిక( Niharika ) తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య( Venkata Chaitanya ) నుంచి విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలంగా వీరిద్దరి గురించి ఈ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కూడా ఈ వార్తలపై స్పందించలేదు కానీ వీరిద్దరూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిహారిక ఈ వ్యవహారంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

 Priya Chowdhary Revealed Shocking Things, Niharika, Venkata Chaitanya, Priya Cho-TeluguStop.com

ఈ సందర్భంగా నిహారిక స్పందిస్తూ తాను చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని వ్యక్తిగత విషయాలపై ఎవరు నెగిటివ్ ప్రచారాలు చేయకండి అంటూ కామెంట్ చేశారు.

Telugu Divorce, Niharika, Priya Chowdary-Movie

ఇలా నిహారిక తన విడాకుల( Divorce ) విషయాన్ని అధికారకంగా తెలియజేయడంతో నిహారిక వెంకట చైతన్య గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే కొందరు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక చైతన్య విడాకుల వ్యవహారంపై లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి( Priya Chowdary ) స్పందించారు.

వ్యక్తిగత విషయం గురించి అదే పనిగా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రియా చౌదరి పేర్కొన్నారు.ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూతురి విషయంలో అందరి తండ్రుల మనసు ఒకటేనని,ఇలాంటి విషయంలో చిరంజీవి కూడా చాలా సున్నితంగా ఉంటారని ఆయన మనసు గాయపరచడం కరెక్ట్ కాదని తెలిపారు.

Telugu Divorce, Niharika, Priya Chowdary-Movie

ఏ తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం ఇలా కావాలని కోరుకోరు అనుకోని కారణాలవల్ల ఇలా జరుగుతున్న వారి జీవితాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తుంటారు.ఇక ఈ కాలంలో పిల్లలు కూడా ఎన్నో విషయాలు తమ తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.తల్లిదండ్రుల నుంచి సహనం ఓర్పు అనే విషయాలను నేర్చుకోవాలని ప్రియా చౌదరి తెలిపారు.ఇక సురేఖ చిరంజీవి ( Surekha ,Chiranjeevi )గారి జీవితం ఎంతోమందికి ఉదాహరణగా చెప్పవచ్చు.

వీరి పెళ్లి పుస్తకం కనుక తెరిచి చూస్తే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుస్తుందని అన్నారు.జీవితంలో భార్యాభర్తల మధ్య అడ్జస్ట్ మెంట్ అనేది ఉండాలని.అప్పుడే ఇద్దరిజీవితం ఎంతో సంతోషంతో ముందుకు నడుస్తుందంటూ ఈ సందర్భంగా నిహారిక చైతన్య విడాకుల విషయం గురించి అనవసరపు వార్తలను సృష్టించకండి అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube