నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.ఇందులో భాగంగా పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ క్రమంలోనే కేరళ, కర్ణాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది.
కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరి కొన్ని చోట్ల ఇళ్లను ఖాళీ చేసిన బాధితులు సహాయక శిబిరాలకు చేరుకుంటున్నారు.కాగా ఇక్కడ భారీ వానలతో ఇప్పటివరకు పది మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటక కోస్తా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







