Bhanushree Mehra: బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సెలబ్రిటీలు( Celebrities ) ఏం పని చేసినా కూడా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.అభిమానులు కూడా వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.

 Varudu Actress Bhanushree Mehra Enjoying Vacation-TeluguStop.com

సెలబ్రిటీలు వారి వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.హీరో,హీరోయిన్ లు షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా చూసిన మీడియాలో ఒక హీరోయిన్ సరదాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బీరు తాగుతూ చిల్ అవుతున్న ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బీర్ తాగుతూ చిల్ అవుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు హీరోయిన్ భానుశ్రీ మెహ్రా( Bhanushree Mehra ).అల్లు అర్జున్ వరుడు సినిమాతో టాలీవుడ్( Tollywood ) కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ సినిమా ప్రారంభం నుండి విడుదల వరకు ఎక్కడా హీరోయిన్‌ని బయట పెట్టలేదు.

నేరుగా సినిమాలోనే చూడాల్సి రావడంతో, ఫిలిం వర్గాల వారితో పాటు ప్రేక్షకాభిమానుల్లోనూ వరుడు కథానాయిక గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఆ తరువాత గోవిందుడు అందరి వాడేలే, అలా ఎలా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మిస్టర్ ఇండియా, 10th క్లాస్ డైరీస్ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.అలా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లోనూ నటించింది భాను శ్రీ.కాగా ఇటీవల వెకేషన్ కోసం వియత్నాం వెళ్లిన భాను, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది.

లోకల్ హిస్టారికల్ ప్లేసెస్, రెస్టారెంట్స్, బీచ్ అన్నిటినీ చుట్టేస్తుంది.రిలాక్స్ అవడానికి సరదాగా బీర్ తాగింది.

బీచ్‌లో, హోటల్‌లో చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CuRq2Y7t4QA/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube