సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ఒక్కోసారి చూసినపుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
అవును, ఓ పర్యావరణ వేత్త ఎంతో సాహసంతో చేసిన పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఆ సామాజిక కార్యకర్త అలసి సొమ్మసిల్లిన నాగుపాముకు( Cobra ) నీరు పట్టి దాన్ని తేరుకునేలా చేసాడు.
తమిళనాడులోని( Tamil Nadu ) కడలూరు జిల్లా తిరుచపరూర్‌లో ఈ ఘటన జరగగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తన ఇంటి వద్ద కోబ్రా నిద్రాణంగా పడి ఉండటాన్ని నటరాజన్ గమనించాడు.
ఆపై నటరాజన్( Natarajan ) పర్యావరణ కార్యకర్త చెల్లాకు సమాచారం అందించాడు.
దీంతో ఘటనా స్ధలానికి చేరుకున్న చెల్లా( Chella ) పాము అచేతనంగా పడిఉండటంతో పాటు డీహైడ్రేషన్‌కు గురైందని గుర్తించాడు.దీంతో తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ కోబ్రాకు ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీరు పట్టడం ప్రారంభించాడు.నీటిని గ్రహించిన పాము చాలా ఆనందంగా బాటిల్ లో వున్న మిగతా నీటిని పూర్తిగా తాగేసింది.
దాంతో పాము మెల్లిగా కోలుకోవడంతో చెల్లా దాన్ని పెద్ద ప్లాస్టిక్ బాటిల్‌లోకి ఎక్కించి అడవిలో విడిచి పెట్టాడు.విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్లే డీహైడ్రేషన్‌కు గురైన పాము అచేతనంగా పడిఉండవచ్చని నటరాజన్‌తో చెల్లా చెప్పుకొచ్చాడు.
ఇక తన ప్రాణాలను పణంగా పెట్టి పామును కాపాడిన చెల్లా సాహసాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దసంఖ్యలో ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా చెల్లా పాములను ఉద్దేశించి జనాలకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు.పాములు ( Snakes ) ఎప్పుడన్నా బహిరంగ ప్రదేశంలోగాని, మీ ఇంటిలో గాని కనబడితే కంగారు పడవద్దని చెబుతున్నాడు.అవి కూడా మనకి మల్లె మంచి జీవులని, మనం భయపడినట్టే అవి కూడా భయపడతాయని కాబట్టి మీరు కంగారు పది వాటిని కంగారు పెడితే వెంటనే కాటు వేస్తాయని… అలా చేయకూడదని సలహా ఇస్తున్నాడు.
అవి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాంతకం కాదని, మనం కూల్ గా ఉంటే అవి కూడా కూల్ గా వెళ్ళిపోతాయని చెప్పుకొచ్చాడు.