కళ్లకు గంతలు కట్టుకుని బాలిక మిరాకిల్స్.. ఎలానో చూడండి

కళ్లకు గంతలు( Blindfolded ) కడితే మనం ఏ పని చేయలేం.అంతా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది.

 Varanasi Girl Riya Tiwari Doing Miracles Blindfolded Details, Eyes, Clothes, Clo-TeluguStop.com

ఏమీ కనిపించకపోవడం వల్ల అంతా అయోమయంగా ఉంటుంది.కళ్లకు గంతలు కట్టుకుని కనీసం కొంతదూరం కూడా నడవలేం.

కానీ ఒక బాలిక మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని మిరాకిల్స్ సృష్టిస్తోంది.గంతలు కట్టుకుని సైకిల్ నడుపుతుంది.

అదీ కూడా కిలోమీటర్ల మేర సైకిల్ డ్రైవ్( Cycle Drive ) చేస్తుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

Telugu Blindfolded, Eyes, Latest, Mid Brain, Miracles, Bi Cycle, Riya Tiwari, Va

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) వారణాసి జిల్లా లోహతా హర్‌పాల్‌పుర్ గ్రామానికి చెందిన రియా తివారీ( Riya Tiwari ) అనే బాలిక వయస్సు 14 సంవత్సరాలు.ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది.అయితే ఈ బాలిక కళ్లకు గంతలు కట్టుకుని వేటినైనా గుర్తించగలదు.కరెన్సీ నోట్లను, రంగులను, పరిసరాలను గుర్తిస్తుంది.అలాగే పేక ముక్కలను కూడా గుర్తుపడుతుంది.వీటితో పాటు కళ్లకు గంతలు కట్టుకుని ఎన్ని కిలోమీటర్లు అయినా సైకిల్ నడపగలదు.

అంతేకాకుండా రియా తివారీ కళ్లకు గంతలు కట్టుకుని అనేక పనులు చేస్తోంది.దీంతో ఈ బాలిక టాలెంట్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Telugu Blindfolded, Eyes, Latest, Mid Brain, Miracles, Bi Cycle, Riya Tiwari, Va

అయితే రియాకు ఈ టాలెంట్ రావడానికి అసలు కారణం యోగా, మెడిటేషన్ అని తెలుస్తుంది.ఈ బాలికకు తండ్రి రాజన్ తివారీ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అనే కోర్సును నేర్పించాడు.ఈ కోర్సు ద్వారా స్పర్శ ద్వారా వేటికైనా గుర్తించవచ్చని, ఇందులో అసాధారణమైన శక్తులు ఏమీ లేవని ఆయన చెబుతున్నాడు.యోగా, మెడిటేషన్ ద్వారా ఎవరైనా ఇలా చేయవచ్చని చెబుతున్నారు.

కానీ ఇందుకు కొద్దిరోజులపాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నాడు.ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సు నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందట.

దీని వల్ల వాళ్లు అనేక విద్యల్లో ప్రావీణ్యం పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube