జాన్ ఆడమ్స్( John Adams ) అమెరికా చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి.అందుకే ఆయన రాసిన ఒక లేఖ ఇప్పుడు లక్షల్లో పలికింది.అతను 1735లో మసాచుసెట్స్‌లో జన్మించారు.1797 నుంచి 1801 వరకు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా కొనసాగారు.అతను అమెరికాకు రెండవ అధ్యక్షుడయ్యారు.అంతకు ముందు, అతను జార్జ్ వాషింగ్టన్( George Washington ) ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.అయితే ఇటీవల, జాన్ ఆడమ్స్ 1824, డిసెంబర్ 14న రాసిన లేఖ వేలంలో రూ.32 లక్షలకు అమ్ముడు పోయింది.ఆయన ఎలెన్ బ్రాకెట్ అనే యువ వధువుకు ఈ లేఖను రాశారు.
ఆ లేఖలో ఆడమ్స్ కొత్తగా పెళ్లయిన జంట పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, వారు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.తాను వారికి నిజమైన స్నేహితుడిగా లేఖపై సంతకం చేశారు.ఈ లేఖ 200 సంవత్సరాలుగా ఫ్యామిలీ కలెక్షన్‌లో ఉంది.
ఇటీవలే కనుగొనబడింది.ఇది ఒక ప్రత్యేకమైన, విలువైన చరిత్ర గలది.
ఎందుకంటే దీనిని జాన్ ఆడమ్స్ మసాచుసెట్స్‌లోని( Massachusetts ) తన ఇంటిలో ఉన్నప్పుడు రాశారు.అయితే ఇప్పుడు ఈ లేఖ దిమ్మ తిరిగే రేంజ్ లో ధర పలకడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
జాన్ ఆడమ్స్ తన స్నేహితుడు, రాజకీయ ప్రత్యర్థి అయిన థామస్ జెఫెర్సన్( Thomas Jefferson ) మరణించిన రోజునే 90 సంవత్సరాల వయస్సులో మరణించారు.ఆడమ్స్ తన చివరి క్షణంలో జెఫెర్సన్ గురించే మాట్లాడటం విశేషం.అయితే ఆయనకు జెఫెర్సన్ అప్పటికే చనిపోయారని తెలియదు.ఏదేమైనా అమెరికా రాజకీయ చరిత్రలో జాన్ ఆడమ్స్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.