దేశవ్యాప్తంగా బిజెపిని( BJP ) ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించడమే కాదు ప్రక్షాళన చేసి చూపించింది.ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుత అధ్యక్షుల పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, నాయకుల మధ్య సమన్వయం లోపించడం వంటి ఎన్నో కారణాలతో ఏడు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బిజెపి అధిష్టానం నియమించింది.దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును( Somu Viraraju ) తప్పించి, ఆయన స్థానంలో స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరుని( Daggubati Purandareshwari ) కొత్త అధ్యక్షురాలుగా నియమించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.తెలంగాణ బిజెపిలో ఈ మధ్యకాలంలో గ్రూపు రాజకీయాల్లో పెరిగిపోవడం, బండి సంజయ్ తీరుపై పాత, కొత్త నేతలు అసంతృప్తితో ఉండడం తదితర కారణాలతో అందరిని కలుపుకునివెళ్లే వ్యక్తిగా గుర్తింపు పొందిన కిషన్ రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించారు.
ఇక ఏపీ బీజేపీ బాధ్యతలు దగ్గుబాటి పురందరేసరికి ఎందుకు ఇచ్చారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.2024 ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు బిజెపి అనేక వ్యూహాలు రచిస్తోంది.ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజు పై వైసీపీ ముద్ర పడడం, పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోవడం, వైసిపి( YCP ) ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై సరైన విధంగా సోము వీర్రాజు పోరాటాలు చేయలేకపోవడం, ముఖ్యంగా తమతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన( Janasena ) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం వంటివే కారణమట.రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారే పరిస్థితిలేకపోవడం వంటి కారణాలతో, ఆయనను తప్పించి కమ్మ సామాజిక వర్గానికి బాధ్యతలను అప్పగించారు.
కేంద్రంలో కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్న సమయంలో పురందరేశ్వరి కేంద్రమంత్రిగా పనిచేయడం, ఏపీలో బలమైన సామాజిక వర్గం అండదండలు ఆమెకు రాజకీయ అనుభవం, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకున్న చరిష్మా ఇవన్నీ లెక్కలు వేసుకునే ఆమెకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.అలాగే పురందేశ్వరి ద్వారాపెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహించవచ్చు అనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్టు సమాచారం.