రఘునందన్ పై బిజేపి లో అంతర్మదనం ?

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ( BJP ) అంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు నాయకులకు బెంచ్ మార్క్ లో ఉండేది .ఆర్ఎస్ఎస్ బావజాలాన్ని నిలువెల్లా నిపుకున్న సుశిక్షితులు అయిన కార్యకర్తలు తమ పార్టీ గెలుపు కోసం యుద్ద సైనికుల లా పోరాడేవారు .

 Bjp Can Retain Raghunandan Rao Details, Raghunandan Rao, Raghunandan Rao Party C-TeluguStop.com

నాయకులు కూడా తమ ప్రయోజనాలను ప్రక్కనపెట్టి జాతీయ బావాలతో పార్టీని నడిపి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నాయకులకు అదికారం లో ప్రదమ ప్రదాన్యం ఇచ్చేవారు .అయితే మారిన రాజకీయ పరిస్థితులలో అదికారం కోసం ఎపుడైతే ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అన్నీ సాంప్రదాయ పార్టీల లాగే బిజేపి కూడా అంతర్గత కలహాలు కుమ్ములాటలతో సతమతమవ్వడం మొదలు పెట్టింది.

ముఖ్యంగా తెలంగాణ భాజపా ఇప్పుడు చుక్కాని లేని నావలా సాగిపోతుంది.ఇప్పటికే బండి సంజయ్( Bandi Sanjay ) ఈటెల ( Etela Rajender ) వర్గాలు పార్టీని నిలువునా చీరిస్తే ఇప్పుడు మరో అసంతృప్తి నేత రఘునందన్( Raghunandan Rao ) ఇంటిగుట్టును బయటపెట్టేసారు.10 సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగిన సైనికుడి లా పనిచేస్తున్నా కూడా కూడా పార్టీ తనను గుర్తించలేదన్న ఆగ్రహం ఆయనను బరస్ట్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు.ఆయన ఏకంగా బాజాపా అధ్యక్షుడు నడ్డా పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టారు.

పార్టీ ప్లోర్ లీడర్ పదవి చాలా కాలం గా కాళీ ఉందని చెప్పినా కూడా నడ్డా పట్టించుకోలేదని , 100 కోట్లు మునుగోడు ఎన్నికల్లో ఖర్చుపెట్టినా పార్టీ గెలవలేదని అదే 100 కోట్లు తనకిచ్చుంటుంటే తెలంగాణను దున్నేసేవాడి నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి.

Telugu Bandi Sanjay, Etela Rajender, Jp Nadda, Raghunandan Rao, Raghunandanrao,

తెలంగాణ అధ్యక్షుడు పదవికి తాను ఎందుకు అర్హుడు కాదు చెప్పాలంటూ నిలదీస్తున్న వైనం ఆయన పార్టీ వైఖరిపై ఎంత అ సంతృప్తిగా ఉన్నారో తెలియజేస్తుంది.తరుణ్ చుగ్ నో సునీల్ బన్సాలి నో చూసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయడం లేదని ఈటెలమూఖాన్ని , తన ముఖాన్ని చూసి వేస్తున్నారు అంటూ తెలంగాణ లో భాజపా ఎదగడానికి తామెంత ముఖ్య కారణమో ఆయన చెప్పిన వైనం చూస్తే కేంద్ర పెద్దలతో ఆయన పంచాయతీ పెట్టుకోవడానికే సిద్దపడ్డారని అని తెలుస్తుంది.అయితే తాను భాజపాలోనే కొనసాగుతానని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ మార్పుపై కొన్ని కీలక సంకేతాలు కేంద్రానికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నట్లు గానే తెలుస్తుంది .

Telugu Bandi Sanjay, Etela Rajender, Jp Nadda, Raghunandan Rao, Raghunandanrao,

పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి కానీ అధ్యక్ష పదవి కానీ ఏదో ఒకటి ఇస్తే తప్ప తాను సంతృప్తి చెందనని సంకేతాలు ఆయన ఇప్పటికే ఇచ్చేశారు.అయితే సరదాగా అన్న మాటలను వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన ఇవ్వాల్సిన మెసేజ్ ను కేంద్ర పెద్దలకు ఇచ్చేసినట్టుగానే తెలుస్తుంది.దుబ్బాక ఎన్నికలలో తన వ్యక్తిగత చరిష్మాతో గెలిచిన రఘునందన్ రావు ఇప్పుడు మరొకసారి తన అక్కడి నుంచి గెలవగలనని స్పష్టం చేశారు.మంచి వాక్ చాతుర్యం తో పాటు వకీల్ కూడా ఆయన రఘునందన్ రావు తెలంగాణ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా కనబడతారు.

మరి అలాంటి కీలక నాయకుడిని భాజపా వదులుకుంటుందో లేక ఆయన షరతులను సంతృప్తి పరిచి నిలబెట్టుకుంటుందో చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube