కాంగ్రెస్ కు ( Congress Party ) నాయకత్వం వహించడానికి భయపడి పారిపోయిన రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తమ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని భాజపా హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) విమర్శించారు.బారాసాను తమ పార్టీకి బీ-టీం గా అభివర్ణించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయన కొట్టి పారేశారు.
కుటుంబ పార్టీలకు దూరంగా ఉన్న చరిత్ర మాది .అని కుటుంబం అండతో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని తెలియజేశారు.నాలుగు నెలలు ఆగితే తెలంగాణ ప్రజానీకం మద్దత్తు ఏ పార్టీ కి ఉందో తెలిసిపోతుందని అప్పటివరకు పగటి కలలు కనటం మానండి అంటూ ఆయన రాహుల్ గాంధీకి సూచించారు.
మీ నాయకత్వంపై నమ్మకం లేకే 19 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌పై గెలిస్తే 12 మంది బారాస పార్టీలోకి వెళ్లిపోయారని ,సొంత పార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని మీరు మా గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందంటూ ఆయన విమర్శించారు.రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన పెట్టిన అభ్యర్థికి తెలంగాణలో ప్రచారం చేసిన ఘనత బారసా పార్టీకి దక్కుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని ,ఆ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కనుకూలంగా ఎవర పని చేస్తున్నారో రాష్ట్రమంతా చూస్తుందని మేము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఎమర్జెన్సీ విధించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది అని మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితితో ఇంత వరకూ కలిసి పనిచేయలేదని భవిష్యత్తులో కూడా ఆ పని చేయబోదని ఆయన స్పష్టంగా కార్యకర్తలకు నమ్మకం కలిగించారు.