'బ్రో' ప్రొమోషన్స్ ఆలస్యం అవ్వడానికి కారణం తమన్ యేనా..! ఇంత నిర్లక్ష్యం ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన లేటెస్ట్ చిరం ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే నెల రోజుల్లో సినిమా పెట్టుకొని నిన్న గాక మొన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యడం పై అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేసారు.

 Pawan Kalyan Bro Movie Promotions Being Late Due To Music Director Thaman Detail-TeluguStop.com

మీడియం రేంజ్ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కూడా తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని రెండు నెలల ముందే ప్రారంభిస్తారని.టీజర్ ని మూడు నెలల ముందు వదులుతారని, ఇక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు అయితే రెండు నెలల ముందే టీజర్ ని విడుదల చేస్తారని, కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకి నెల రోజులు ముందు టీజర్ ని వదలడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు, ఒక్క బ్రో విషయం లోనే అలా జరిగింది.

Telugu Bro, Bro Teaser, Bro Avatar, Samudrakani, Music Thaman, Pawan Kalyan, Sai

అయితే ‘బ్రో’ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం మాత్రం సంగీత దర్శకుడు థమన్( Thaman ) అని అంటున్నారు ఇండస్ట్రీలో.ఎందుకంటే థమన్ ఇప్పుడు ఒక్క సినిమా కోసం కాదు, ఏకంగా 12 సినిమాల కోసం పనిచేస్తున్నాడు.దాని వల్ల ఆయన మీద వర్క్ లోడ్ ఒక రేంజ్ లో పడిపోవడం వల్ల ఆయన అనుకున్న సమయానికి ట్యూన్స్ అందించలేకపోతున్నాడట.ఈ విషయం లో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు చేత కూడా చివాట్లు పెట్టించుకున్నట్లు గా తెలుస్తుంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఆ టీజర్ విడుదలయ్యే ముందు రోజు ఇచ్చాడట.ఇక దానిని వీడియో కి ఎన్ హ్యాన్స్ చేసి ఫైనల్ టీజర్ కట్ ఇచ్చేలోపు చాలా ఆలస్యం అయ్యింది అట.అందువల్లే టీజర్ ని చెప్పిన సమయానికి కాకుండా రెండు గంటలు ఆలస్యం అయ్యింది.

Telugu Bro, Bro Teaser, Bro Avatar, Samudrakani, Music Thaman, Pawan Kalyan, Sai

ఇక పోతే ప్రస్తుతం ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మరియు హీరోయిన్ మీద జర్మనీ లో ఒక పాటని చిత్రీకరిస్తున్నారట.ఈ పాటకి సంబంధించిన పూర్తి వర్క్ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదట.కేవలం రఫ్ కట్ ని ఉపయోగించి ఈ సాంగ్ ని జర్మనీ లో చిత్రీకరిస్తున్నారట.

ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు రీ రికార్డింగ్ కి సంబంధించిన పనులు చాలా బ్యాలన్స్ ఉన్నాయి.అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇంత ఆలస్యం అవుతుందని అంటున్నారు.

డబ్బులు కోరినంత ఇస్తున్నారు కదా అని శక్తి కి మించి పనులు చేస్తే ఇలా సరికొత్త తలవొంపులు వస్తాయని టాలీవుడ్ కి చెందిన కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube