రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్..!!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో( BJP ) మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.కర్ణాటకలో ఓడిపోవడంతో తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

 Bjp National Leader Sunil Bansal To Telangana Tomorrow Details, Bjp, Sunil Bans-TeluguStop.com

దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని( Bandi Sanjay ) కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ( Kishan Reddy ) రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధినాయకత్వం నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బీజేపీ కిషన్ రెడ్డిని ముందు పెట్టి ఎదురుకోవటానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు 40 సంవత్సరాల అనుభవంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు.ఎన్నికల సమయంలో క్యాడర్ మరియు నాయకులు మధ్య సమన్వయం కావాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి అయితే కరెక్ట్ అని బీజేపీ హైకమాండ్ భావించినట్లు వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్( Sunil Bansal ) రాబోతున్నారు.

రెండు రోజులపాటు పార్టీ సంస్థాగత అంశాలపై నేతలతో చర్చించనున్నారట.తెలంగాణ బీజేపీ పార్టీలో కీలక నాయకుల మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలో బన్సల్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube