యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న చిత్రాలు చాలానే ఉన్నాయి.అందులో మహానటి ఫేం నాగ్ అశ్విన్ ( Nag Ashwin )దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కే( Project K ) ఒకటి అనే విషయం తెల్సిందే.
ఈ సినిమా ను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే.హీరోగా ప్రభాస్ ను చాలా విభిన్నంగా చూడబోతున్నాం.
అంతే కాకుండా సినిమా యొక్క కథ మరియు కథనాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయి అంటున్నారు.

గతంలో బాలయ్య ఆదిత్య 369( Aditya 369 ) సినిమా లో మాదిరిగా గతంలోకి మరియు ఫ్యూచర్ లోకి వెళ్లే సన్నివేశాలు ఉంటాయట.ఫ్యూచర్ లోకి వెళ్లిన సమయంలో ప్రభాస్ యొక్క పాత్ర మరియు ఆయన నటన కచ్చితంగా కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు.ఫ్యూచర్ సన్నివేశాల్లో ప్రభాస్ కనిపించడంతో పాటు ఆ సన్నివేశాల స్క్రీన్ ప్లే షాకింగ్ గా ఉంటుందట.
ఫ్యూచర్ నిజంగ ఇలాగే ఉండబోతుందా అన్నట్లుగా అంతా కూడా మాట్లాడుకుంటారట.మొత్తానికి మన తెలుగు సినిమా కు పాన్ వరల్డ్ టచ్ ఇచ్చి మరీ రూపొందిస్తున్నారు.

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అంటే ఇష్టం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ను చూస్తారు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా యొక్క హడావుడి మొదలు పెట్టారు.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే( Deepika Padakune ) నటిస్తుంది.అంతే కాకుండా ముఖ్య పాత్రకు గాను దిశా పటానీ నటిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.ప్రాజెక్ట్ కే సినిమా లో బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
హాలీవుడ్ లో కూడా ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.







