ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం.5.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.50
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేయాలనే పట్టుదల మీలో ఉంటుంది.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది.ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవాలి.
కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.
సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కన్య.:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కాస్త సమయాన్ని కుటుంబసభ్యులతో గడవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:
రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని వృధా చేయకూడదు.మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగే అవకాశం ఉండదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం పొందుతారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.