టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని( Ram Pothineni ) ఒకరు.ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ముందులో అన్ని ప్రేమ కథలతో అలరించిన రామ్ ఇప్పుడు మాత్రం తన లైనప్ ను వరుసగా యాక్షన్ సినిమాలతో ఫిల్ చేసుకుంటున్నాడు.ఇష్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో అదే దారిలో నడుస్తున్నాడు.
రామ్ ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinu ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.రామ్ హీరోగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.
పాన్ ఇండియా రేంజ్ లో బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో కాస్త భారీగానే ప్లాన్ చేసారు.
ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులు అవుతుంది.
ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ థండర్ అంటూ రిలీజ్ చేసిన వీడియో అందరిని ఎంతగానో అలరించింది.అంతేకాదు అంచనాలు భారీగా పెంచేసింది.
ఇక ఆ తర్వాత ఇటీవలే రిలీజ్ డేట్ అఫిషియల్ గా ప్రకటించారు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ అప్పుడు బాలయ్య పోటీలో ఉండడం వల్ల ఒక నెల ముందుగానే సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి డేట్ అండ్ టైం లాక్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.జులై 3న ఉదయం 11 గంటల 25 నిముషాలకు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ‘స్కంద’ అనే టైటిల్ ను పెడుతున్నట్టు నెట్టింట వైరల్ అవుతుండగా మరి మేకర్స్ ఏ టైటిల్ ప్రకటిస్తారో వేచి చూడాలి.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







