నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి!

గ్యాస్ లేదా గ్యాస్ట్రిక్.( Gastric Problems ) సర్వ సాధారణంగా వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.

 Follow These Precautions For Avoiding Gastric Problem!, Healthy Lifestyle, Lates-TeluguStop.com

ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ హెవీగా తిన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గ్యాస్ వచ్చేసింది అని అంటుంటారు.గ్యాస్ సమస్య కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

ఈ క్రమంలోనే గ్యాస్ సమస్య నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.అయితే కొందరు నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు.

దీంతో ఏం తినాలన్నా వెనకడుగు వేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే కచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Telugu Gastric Problem, Tips, Latest-Telugu Health

నిత్యం మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు అంటే మీ జీవన శైలి సక్రమంగా సాగడం లేదని అర్థం.అందుకే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు బయట ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.

ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ను కంప్లీట్ గా ఎవైడ్ చేయాలి.

గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు ఒకే చోట అస్సలు కూర్చోకూడదు.

అటు ఇటు నడుస్తూ ఉండాలి.దీని వల్ల గ్యాస్ సులభంగా బయటకు వస్తుంది.

గ్యాస్ సమస్య మీ దరి చేరకుండా ఉండాలి అంటే ఖ‌చ్చితంగా మీరు హైడ్రేటెడ్( Hydrated ) గా ఉండాలి.అందుకోసం నిత్యం రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ ను తీసుకోవాలి.

కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కృత్రిమ స్వీటెనర్స్ వంటి వాటిని తీసుకోవడం మానేయాలి.అలాగే భోజనం చేసేటప్పుడు త్వరత్వరగా తినేస్తుంటారు.

ఈ అలవాటు ఉంటే కనుక మానుకోండి.భోజనం బాగా నములుతూ నెమ్మదిగా తినాలి.

Telugu Gastric Problem, Tips, Latest-Telugu Health

తద్వారా ఫుడ్ ఫాస్ట్ గా జీర్ణం అవుతుంది.ఫలితంగా గ్యాస్ తో సహా వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు వేధించకుండా ఉంటాయి.నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోండి.చూయింగ్ గమ్ ను అస్సలు నమ‌ల‌కండి.రోజు కనీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయండి.ప్ర‌తి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్9( Apple Cider Vinegar ) ను క‌లిసి తీసుకోండి.

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణ‌ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.గ్యాస్ సమస్య దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube