తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది.అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తయింది.
అయితే చివరి దశలో ఏజ్ రిలాక్సేషన్ వివాదం తెరపైకి వచ్చింది.ఈ క్రమంలో వయసు నిబంధనపై నోటిఫికేషన్ లో పేర్కొన్న విధానాన్నే అనుసరిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
కాగా అన్ని టెస్టులు క్వాలిఫై అయినా వయసు కారణంగా పలువురు అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారని పేర్కొంది.ఎలాంటి పుకార్లను నమ్మొద్దని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది.బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థుల వివరాలు చెబితే రూ.3 లక్షల రివార్డు అందజేస్తామని బోర్డు ఛైర్మన్ ప్రకటించారు.