భారతదేశానికి చెందిన జోయా వోరా-షా( Zoya Vora-Shah ) చాలా సంవత్సరాల క్రితం యూఎస్‌కి వెళ్లి అరిజోనాలోని ( Arizona ) స్కాట్స్‌డేల్ టౌన్‌లో “ది వైన్ కలెక్టివ్ ఆఫ్ స్కాట్స్‌డేల్”ను( The Wine Collective of Scottsdale ) ప్రారంభించారు.ఆ పురాతన నగరంలో ఆమె స్థాపించినది ఎనిమిదవ వైన్ టేస్టింగ్ రూమ్ అయింది.
ఇందులో రకరకాల వైన్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.అన్ని వైన్స్ టేస్ట్ చేసేందుకు వీలు కల్పించే ఈ వైన్ కలెక్టివ్ నగర వాసులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

జోయా తన వైన్ వ్యాపారాన్ని 20 ఏళ్ల క్రితం ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలోని ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రారంభించారు, అక్కడ ఆమె వైన్ పెయిరింగ్ చేయడంపై ఆసక్తిని పెంచుకున్నారు.తర్వాత వైన్, స్పిరిట్స్ విక్రయాల ప్రతినిధిగా మారారు.ఆపై వైన్ చరిత్ర, వర్గీకరణలలో జ్ఞానం, సర్టిఫికేషన్లు పొందారు.జోయా తర్వాత వాషింగ్టన్ D.Cలోని మోయెట్ హెన్నెస్సీ, డియాజియో నుంచి పోర్ట్‌ఫోలియోలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందుకున్నారు.ఆ సమయంలో షాంపైన్‌లో తన నైపుణ్యాన్ని మరింతగా పెంచుకున్నాయి.

తరువాత ఆమె స్థాపించిన వైన్ కలెక్టివ్ అనేది ప్రీమియం అరిజోనా వైన్ టేస్టింగ్ రూమ్, వైన్ బార్, బాటిల్ షాప్‌గా అవతరించింది.ఈ కంపెనీ అతిథుల అభిరుచుల ఆధారంగా వైన్స్‌ను క్యూరేట్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది.ప్రత్యేకమైన టేస్ట్ వర్క్‌షాప్‌ను కూడా అందిస్తుంది.సవాళ్లు ఉన్నప్పటికీ జోయా తన అభిరుచిని కొనసాగించడంలో గర్విస్తుంది.భారతదేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా, ఆమె వైద్య రంగంలో వృత్తిని కొనసాగించాలని లేదా సాంప్రదాయ పాత్రలకు అనుగుణంగా ఉండాలని చాలామంది చెప్పారు.అయినా ఆమె పట్టుదలతో తన భర్త, స్నేహితులు, సలహాదారుల నుంచి మద్దతు పొంది విభిన్న వ్యాపారంలో సక్సెస్ అయ్యారు.







