సెమీ కండక్టర్స్ చిప్స్( semiconductor chips ) రంగంలో భారత్ దూసుకెళ్లనుంది.ఇటీవల ప్రధాని మోదీ( Narendra Modi ) అమెరికా పర్యటన తర్వాత దీని గురించే పెద్ద చర్చ జరుగుతోంది.
మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడానికి కారణాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు.ఇప్పటివరకు వివిధ దేశాల్లో సెమీ కండక్టర్ చిప్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతుంది.
ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ రంగం ద్వారా లక్షల కోట్ల పెట్టుబడి రానుందని చెబుతున్నారు.సెమీ కండక్టర్స్ చిప్స్ రంగంలో ఇండియాకు ఏకంగా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చని చెబుతున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ విభాగం కింద ఈ పథకానికి 76 వేల కోట్ల బిలియన్ డాలర్లు ప్రకటించారు.

సెమీ కండక్టర్స్ చిప్స్ తో పాటు డిస్ల్పే తయారీ( Display ) ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టం కోసం ఈ డబ్బులు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే యూఎస్ కు చెందిన సెమీ కండక్టర్ కంపెనీ అయిన అప్లైడ్ మెటీరియల్స్ ఇండియాలో 400 కోట్ల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది.ఇందుకోసం కొత్త ఇంజినీరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.
అంతేకాకుండా రెమిసాన్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్, ఏఏండీ, టీఎస్‌ఎంసి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా త్వరలో పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఇక తైవాన్ కంపెనీ భారత్ లో టీఎస్‌ఎంఎస్సి చిప్ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీని ఏర్పాటు చేయనుంది.ఇందుకోసం వివిధ ఏజెన్సీలతో మాట్లాడుతుంది.ఈ పెట్టుబడులతో భారత్ సెమీ కండక్టర్ చిప్స్ రంగంలో దూసుకుపోనుందని తెలుస్తోంది.
సెమీ కండక్టర్ కాంపోనెంట్ వ్యాపారం 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు.బెంగళూరు, చెన్నైలో త్వరలో కొన్ని కంపెనీలు సెమీ కండక్టర్స్ చిప్స్ కు తయారీకి సంబంధించిన సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి.