యూఎస్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన నిఖిల్.. స్పై కూడా ఆ లిస్టులోకి చేరుతుందా?

ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అవుతుందో లేదో అని అనుకున్న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.హీరోకు, నిర్మాతకు మధ్య ఎంతో సుదీర్ఘమైన చర్చల తర్వాత ఈ సినిమాను నిర్మాత అనుకున్న విధంగానే ఈ రోజు రిలీ చేసాడు.

 Nikhil's Spy Movie Solid Collections In Usa Premieres, Usa, Nikhil Siddharth, Sp-TeluguStop.com

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Hero Nikhil Siddharth ) రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.

అందుకే ఆయన నటించిన స్పై సినిమాను కొద్దిగా సమయం తీసుకుని ప్రమోషన్స్ మరికాస్త పెంచి రిలీజ్ చేయాలని అనుకున్నాడు.కానీ నిర్మాత కారణాల వల్ల ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వక తప్పలేదు.ప్రస్తుతం నిఖిల్, ఐశ్వర్య మీనన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ”స్పై”.

( Spy Movie ) యాక్షన్ థ్రిల్లర్ గా బీహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు బాగానే ఉన్నాయి.

అందులోను కార్తికేయ 2, 18 పేజెస్, వంటి వరుస హిట్స్ తర్వాత నిఖిల్ చేయబోతున్న సినిమా ఇదే కావడంతో అందులోను ఇది కూడా డిఫరెంట్ గా తెరకెక్కుతుండటం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమా ఈ రోజు జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పడ్డాయి.

మరి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా నిఖిల్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు టాక్.

ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్( Spy Movie US Premiers ) ద్వారానే 1 లక్ష 35 వేల డాలర్స్ కి పైగానే రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.దీంతో మంచి స్టార్ట్ తో స్పై సినిమా యూఎస్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకోగా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.దీంతో ఈ సినిమాతో నిఖిల్ మరో హిట్ అందుకోవడం ఖాయం.

ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube