దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( S.S Rajamouli ) తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.తెలుగు సినిమా కీర్తి ఏంటో బాహుబలి ( Bahubali ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయికి పరిచయం చేసినటువంటి రాజమౌళి ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో అంతర్జాతీయ వేదికపై మారుమోగిపోయింది.
ఇలా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడం విశేషం.ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఈ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా అకాడమీ కొత్తగా 398 మందిని జ్యూరీ మెంబర్స్ (Juri Members) గా ఎంపిక చేశారు.అయితే వీరిలో ఆర్ఆర్ఆర్ హీరోలతో పాటు ఇతర చిత్ర బృందం ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పాలి.తాజాగా యాడ్ అయినటువంటి ఈ 398 జ్యూరీ మెంబర్స్ లో హీరోలతో పాటు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా ఉన్నారు.అయితే ఈసారి సౌత్ ఆసియాకి చెందిన వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
ఇక ఈ జ్యూరీ మెంబర్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ హీరోలైనటువంటి ఎన్టీఆర్( NTR ) రామ్ చరణ్ ( Ramcharan ) లు కూడా ఎంపికయ్యారు అదేవిధంగా సంగీత దర్శకుడు కీరవాణి( Keeravani ), పాటల రచయిత చంద్రబోస్( Chandrabose ), సెంథిల్, సాబు సిరిల్ ఉన్నారు.అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినటువంటి రాజమౌళి పేరు లేకపోవడం గమనార్హం.ఇలా ఆర్ఆర్ఆర్ హీరోలు ఇద్దరు కూడా ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఓటింగ్లో వీరు కూడా ఓట్లు వేయబోతున్నారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి మెగా నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.