'తొలిప్రేమ' క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగులగొట్టిన అమితాబ్ బచ్చన్..కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

తెలుగు చలన చిత్రం పరిశ్రమలో ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ( Tholi Prema )’ చిత్రం కచ్చితంగా ఉంటుంది.ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్( Pawan kalyan ) స్టార్ హీరో అయ్యాడు, అప్పటి వరకు ఆయన కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఇండస్ట్రీ లో చలామణి అయ్యాడు.

 Amitabh Bachchan Who Broke The Screen After Seeing The Climax Of 'tholi Prema ,-TeluguStop.com

ఎప్పుడైతే తొలిప్రేమ సినిమా వచ్చిందో, అప్పటి నుండి యూత్ ఐకాన్ గా మారిపోయాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసి చాలా మంది తమని తాము ఊహించుకుంటారు.

మా నిజ జీవితం కూడా ఇలాగే ఉంటుంది కదా అని గుర్తు చేసుకుంటారు.ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం టాలీవుడ్ లవ్ స్టోరీస్ చరిత్ర లోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.

వాస్తవానికి క్లైమాక్స్ వల్లే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది అనడం లో అత్రిశయోక్తి లేదు.అయితే ఈ సినిమా క్లైమాక్స్ ని చూసి ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతిలో ఉన్న కార్ తాళాలను స్క్రీన్ మీదకి విసిరాడట.

Telugu Tholi Prema, Chennai, Karunakaran, Pawan Kalyan, Tollywood-Movie

రేపు తొలిప్రేమ సినిమా గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్, గతం లో ఈ చిత్రం గురించి చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులు సోషల్ మీడియా లో మరోసారి షేర్ చేసుకోగా అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘చెన్నై కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చినప్పుడు నన్ను కలిశారు.

ఆయన నా తొలిప్రేమ చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడాడు.సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్న సమయం లో క్లైమాక్స్ కి వచ్చినప్పుడు హీరోయిన్ హీరో ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ని కోపం వచ్చి తన చేతిలో ఉన్న కార్ తాళాలను తీసి స్క్రీన్ మీద విసిరాడు.

ఇదేమి క్లైమాక్స్, ఆ అమ్మాయి అలా ఎలా వెళ్ళిపోతుంది, అసలు డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడు అని కోపం తో పైకి లేచి వెళ్ళిపోబోతున్నాడట.అప్పుడు జయ బచ్చన్ చిన్నగా క్లాప్స్ కొట్టడం ని గమనించాడట అమితాబ్, ఏంటని వచ్చి చూసాక, హీరోయిన్ మళ్ళీ వెనక్కి వచ్చిన విషయం ని తెలుసుకొని, ఒక అద్భుతమైన సినిమాని చూసాను అనే అనుభూతితో బయటకి వెళ్ళాడట’ అంటూ చెప్పుకొచ్చాడు కరుణాకరన్.

Telugu Tholi Prema, Chennai, Karunakaran, Pawan Kalyan, Tollywood-Movie

ఇక ఈ సినిమాని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా జరిగాయి, మరి ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో ఖుషి రీ రిలీజ్ రేంజ్ రికార్డ్స్ ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube