టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై ఇరు పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి.
లింగమనేని తరపు న్యాయవాదితో పాటు సీఐడీ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతించాలా వద్దా అన్న దానిపై కోర్టు తీర్పును వెలువరించనుంది.
అయితే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్ కు సీఐడీకి అనుమతి లభిస్తుంది.ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వెలువరించే తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.