వైసిపి( YCP ) కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తారు మారైంది.వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రెబెల్ గా మారడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే వారిని సస్పెండ్ చేసినట్లు వైసిపి ప్రకటించింది.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలనే పట్టుదలతో అధికార పార్టీ ఉంది.అందుకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ), ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ( Mekapati Chandrasekhar Reddy )చెక్ పెట్టే విధంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు వైసిపి ప్లాన్ చేస్తుంది.2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ సీట్ చేసింది .వచ్చే ఎన్నికల్లోనూ ఇదేవిధంగా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.

దీనిలో భాగంగానే రెబల్ గా మారిన పార్టీ ఎమ్మెల్యేల ను ఓడించేందుకు అన్ని రకాల ఎత్తుగడలను వేస్తోంది.ఇప్పటికే వెంకటగిరి, నెల్లూరు రూరల్ స్థానాలకు కొత్తగా కోఆర్డినేటర్లను ఇప్పటికే నియమించింది.వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ( Nedurumalli to Ram Kumar Reddy )అప్పగించగా, నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉదయగిరి వైసీపీ ఇన్చార్జిగా మేకపాటి రాజారెడ్డిని( Mekapati Raja Reddy ) నియమిస్తూ వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
జగన్ తో పాటు పార్టీ కీలక నాయకుల పైన అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అలాగే ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువ గళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంగా లోకేష్ తోనూ భేటీ అయ్యారు.ఈ పరిణామాలు తర్వాత చంద్రశేఖర్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడించేందుకు మేకపాటి కుటుంబానికి చెందిన రాజారెడ్డిని వైసీపీ ఇప్పుడు తెరపై తీసుకు వచ్చింది.







