మార్కెట్‌లోకి కొత్త ఏసీ.. ఎంత వాడినా కరెంట్ బిల్ సున్నా

ఎండాకాలంలో ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలామంది ఇంట్లో ఏసీలు వినియోగిస్తూ ఉంటారు.చల్లని వాతావరణం కోసం ఏసీలు కొనుగోలు చేస్తూ ఉంటారు.

 New Ac In The Market. No Matter How Much It Is Used, The Current Bill Is Zero,-TeluguStop.com

దీంతో ఎండాకాలం వస్తే ఏసీల ధరలు( AC ) కూడా పెరుగుతూ ఉంటాయి.ఇక ఇంట్లో ఏసీ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్లు కూడా మొత్తం మొత్తంలో వస్తుంది.

ఏసీకి కరెంట్ బిల్లు( AC current bill ) చాలా ఖర్చువుతుంది.దీంతో రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంచుకుంటే కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది.

అయితే మార్కెట్ లోకి కొత్త రకం ఏసీ అందుబాటులోకి వచ్చింది.ఈ ఏసీని ఎంత వాడినా కరెంట్ బిల్లు రాదట.సోలార్ ఏసీలు( Solar ACs ) ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేశాయి.

ఇవి సూర్యరశ్శి నుంచి సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ శక్తిపై పనిచేస్తాయి.ఈ సోలార్ ఏసీల వల్ల కరెంట్ అవసరం అసలు ఉండదు.

ఈ సోలార్ ఏసీ సౌరశక్తి, సోలార్ బ్యాటరీ బ్యాంక్, విద్యుత్ ద్వారా పనిచేస్తుంది.సోలార్ ప్యానెళ్లు పగటిపూట మాత్రమే పనిచేసినప్పటికీ.

బ్యాటరీ సహాయంతో రాత్రి కూడా ఏసీ వాడుకోవచ్చు.ఇందుకోసం సోలార్ ప్యానెల్స్‌ను ఇంటి పైకప్పు మీద పెట్టుకోవాల్సి ఉంది.

అయితే కరెంట్ అవసరం లేని ఈ సోలార్ ఏసీ ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి.సాధారణ ఏసీలతో పాటు డబుల్ రేట్లు ఉంటాయి.ఈ కామర్స్ వెబ్ సైట్లతో పాటు షాపుల్లో కూడా ఈ సోలార్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు.

చాలా వెబ్ సైట్లలో ఈ సోలార్ ఏసీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.ప్రస్తుతం ఏసీలు ఎక్కువగా వాడేవారికి కరెంట్ బిల్లు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వస్తూ ఉంటుంది.కానీ సోలార్ ఏసీల వల్ల ఆ డబ్బులు ఆదా అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube