కొండచిలువ నుంచి పిల్లల్ని కాపాడుకున్న బాతు.. చివరకు ఇలా ప్రాణాలు విడిచింది.

అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.అమ్మను దైవంతో అందరూ పోలుస్తారు.

 The Duck That Saved The Children From The Python Finally Died Like This. Phyton-TeluguStop.com

అమ్మ ప్రేమ స్వచ్చంగా, నిస్వార్ధంగా ఉంటుంది.అమ్మ ప్రేమ ముందు ఎవరి ప్రేమ సరిపోదు.

పిల్లలపై అమ్మ చూపించే ప్రేమను ఎవరూ మాటలతో చెప్పలేరు.తన పిల్లల కోసం అమ్మ పడే తపన, త్యాగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయరు.

పిల్లల కోసం తమ శక్తినంత దారబొస్తారు.పిల్లలను ప్రయోజకులను చేసేందుకు కష్టపడుతూ ఉంటారు.

పిల్లల కోసం ఆఖరికి తన ప్రాణాలను సైతం తల్లి లెక్కచేయదు.తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

మనుషుల్లోనే కాదు.జంతువులు కూడా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లవు.వాటిని వేరే జంతువుల దాడి నుంచి కాపాడుతూ ఉంటాయి.ఒక బాతు( Duck ) తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది.బాతు తన పిల్లలతో కలిసి గొయ్యి వంటి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది.

అయితే ఒక కొండచిలువ బాతులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది.దీంతో కొండచిలువ నుంచి తప్పించుకునేందుకు పిల్లలను బాతు గొయ్యి నుంచి బయటకు పంపించింది.

కొండచిలువ లోపలికి వచ్చేలోపు పిల్లలను బయటకు పంపించి వేసింది.

కానీ తల్లి బాతు మాత్రం కొండచిలువ( Phyton ) వచ్చేలోపు బయటకు రాలేకపోతుంది.దీంతో బాతును కొండచిలువ చుట్టేస్తుంది.బాతు తప్పించుకోవడానికి వీల్లేకుండా గట్టిగా కొండచిలువ చుట్టుకుంటుంది.

దీంతో ఊపిరాడక బాతు చనిపోయింది.సోషల్ మీడియా( Social media )లో దీనికి సంబంధించి వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.

ట్విట్టర్ లో ది బృతల్ నేచర్ అనే యూజర్ షేర్ చేశాడు.ఈ వీడియో 44 సెకన్ల పాటు ఉంది.

ఇప్పటివరకు దాదాపు 17 వలే మంది వీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube