తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చురకలు పెట్టారని తెలుస్తోంది.కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసని చెప్పారు.ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా తనకు తెలుసన్నారు.
ఒకవేళ నేతల మధ్య విభేదాలు ఉంటే రాష్ట్ర ఇంఛార్జ్ తో లేదా తనతో మాట్లాడాలని సూచించారు.అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడొద్దని తేల్చి చెప్పారు.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వెల్లడించారు.అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
పార్టీ కోసం అందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు.







