గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్న రామ్ గోపాల్ వర్మ వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా రెండు సినిమాలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందేజగన్ (YS Jagan Mohan Reddy )ప్రయాణాన్ని రెండు భాగాలుగా సినిమాలుగా తీస్తానని మొదటి భాగానికి వ్యూహం అని రెండో భాగానికి శబధమని ఆయన టైటిల్స్ ని కూడా ప్రకటించారు.దానికి అనుగుణంగానే వ్యూహం టీజర్ ని కూడా రిలీజ్ చేశారు అయితే జగన్ అనుకూలం గా సినిమా తీసే ప్రయత్నంలో తమ అధినేత్రి సోనియా గాంధీ( Sonia Gandhi )ని చెడుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు రామ్ గోపాల్ వర్మ( Ram gopal varma ) తీసే సినిమాలో తమ నాయకురాలిని చెడుగా చూపిస్తే మాత్రం రామ్ గోపాల్ వర్మ ను బట్టలూడదీసి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.

వైయస్ మరణానంతరం అసువులు బాసిన కార్యకర్తలను ఆదుకోవడానికి ఓదార్పు యాత్ర చేపడతానన్న జగన్ ప్రయత్నాన్ని సోనియా అడ్డుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు వ్యూహం సినిమాలో ఆ ఘట్టాన్ని చూపించి సోనియాగాంధీని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ రకంగా స్పందించడం విశేషం.

ఇప్పటికే రాంగోపాల్ వర్మ సినిమా పట్ల జనసేన అభిమానులు టిడిపి కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఉన్నారు.తమ అధినాయకులను ఇప్పటికే తన సినిమాలలో విలన్లుగా చూపిస్తున్న వర్మ, వ్యూహం సినిమాలో అదే పందా ను అనుసరించబోతున్నారని ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు.గత కొన్ని రోజులుగా వైయస్సార్ పార్టీ కార్యకర్తలను మించి జగన్ వెనకేసుకొస్తున్న వర్మ ఆయన పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు కూడా ట్విట్టర్ వేదికగా చేస్తున్నారు.
అయితే వర్మకు జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక సహకారంతోనే ఇలా ఆయన జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి.ఏది ఏమైనా ఇప్పటికే అగ్రహంతో ఉన్న జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు తోడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కలిస్తే రాంగోపాల్ వర్మకి ఇబ్బందులు తప్పక పోవచ్చు అని వార్తలు వస్తున్నాయి మరి వర్మ ఈ సెగను ఎలా ఎదుర్కొంటారో చూడాలి
.






