సౌత్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha) ఈమధ్య తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది.కమర్షియల్ సినిమాలకు దాదాపు నో అనేస్తున్న అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రం సై అనేస్తుంది.
ఈ క్రమంలోనే సమంత నందిని రెడ్డి( Nandini Reddy )డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో పాటుగా ఒక స్టార్ హీరో సినిమా వచ్చినా సరే ఆమె చేయనని చెప్పిందట.
అలా ఎందుకు అంటే ఆ వచ్చిన స్టార్ హీరో సినిమాలో సమంతకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదట.అందుకే సమంత ఆ సినిమా కాదన్నదని తెలుస్తుంది.
ఇక మరోపక్క సమంత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది.స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడప్పుడే చేసే ఉద్దేశం లేదని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత యువ హీరోలతో జత కడుతుందని అంటున్నారు.సో ఈ టైం లో స్టార్ హీరోల సినిమాల్లో కేవలం పాటల కోసం చేయడం కన్నా యంగ్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేస్తే బెటర్ అని అనుకుంటుందట.
అందుకే సమంత ఇక మీదట సోలో సినిమాలు లేదా యంగ్ హీరోల సినిమాలు చేయాలని చూస్తుంది.