రష్యాలో( Russia ) అంతర్యుద్ధం చాపకింద నీరులాగా సాగిపోతోంది అనుకుంటే ఒక్కసారిగా బ్రేకులు పడ్డట్టు అయిన పరిస్థితి నెలకొంది.అవును, వాగ్నర్ దళాలు( Wagner Group ) మాస్కోవైపు కదులుతూ హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో( Yevgeny Prigozhin ) బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో( Alexander Lukashenko ) చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేయడం కొసమెరుపు.మరోవైపు ప్రిగోజిన్ కూడా టెలిగ్రాం ద్వారా తన సందేశాన్ని వినిపించారట.
రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను నిలువరించడానికి అంగీకరించమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరిగి తమతమ స్థానాల్లోకి వెళ్లిపోతున్నామని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇకపోతే అధ్యక్షుడు పుతిన్( Putin ) పెంచి పోషించిన కిరాయి సేన వాగ్నర్ గ్రూపనే సంగతి ఇక్కడ చాలామందికి తెలియదు.అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఆ గ్రూప్ ఆయనపైనే తిరుగుబాటు చేయడానికి జెండా ఎగురవేసింది.ఈ దళం దాదాపు మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లగా ఈ తిరుగుబాటును సమర్థంగా తిప్పికొట్టేందుకు పుతిన్ సేనలు సిద్ధంగా వున్నాయి.దీంతో పెద్దఎత్తున రక్తపాతం తప్పదన్న భయానక వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో పుతిన్ మాస్కోను వీడారనీ, ఓ బంకర్‌లోకి తలదాచుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.చివరికి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడం గమనార్హం.

ఇకడంతో తాము ఉక్రెయిన్ సరిహద్దులోని తమ స్థావరాలకు తిరిగి వెళ్లిపోతున్నామని ప్రకటించారు వాగ్నర్ అధినేత ప్రిగోజిన్. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభంలో రష్యా జైళ్లలోని దాదాపు 50వేల మంది ఖైదీలను విడుదల చేసి వాగ్నర్ గ్రూపులో చేర్చుకోవడం జరిగింది.అంతకన్నా ముందే కొంతమంది కిరాయి సైన్యంతో ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌పై ప్రిగోజన్ దాడి చేయించాడు.అయితే ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ వాగ్నర్ గ్రూప్‌కి రష్యా సైన్యం ఆయుధాలను పంపకపోవడం కొసమెరుపు.
దీంతో ఈ కిరాయి సైన్యానికి చెందిన వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.అప్పటి నుంచి రష్యా డిఫెన్స్ మినిస్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రిగోజిన్.తిరుగుబాటు ప్రకటించాడు.