బీజేపీ, బి‌ఆర్‌ఎస్ మద్య దోస్తీ.. ఇదే సంకేతం ?

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్( BRS party )బీజేపీ మద్య దోస్తీ కుదిరిందా ? పొత్తు కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయా ? బద్ద శతృత్వం ప్రదర్శించే ఈ రెండు పార్టీలు కలవడం ఖాయమేనా ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి.ఆ మద్య బీజేపీ అంటేనే ఒంటికాలుపై లేచి విమర్శలు గుప్పించే కే‌సి‌ఆర్.

 Has There Been A Friendship Between Brs And Bjp?, Brs , Bjp, Ts Politics , Cm Kc-TeluguStop.com

ఈ మద్య బీజేపీపై అసలు విమర్శలు చేయడమే మానేశారు.అటు కే‌టి‌ఆర్ కూడా తన విమర్శలలో బీజేపీ ప్రస్తావన తీసుకురావడం లేదు.

సడన్ గా బి‌ఆర్‌ఎస్ లో ఎందుకీ మార్పు అనే దానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

Telugu Amit Shah, Cm Kcr, Mlc Kavitha, Telangana, Ts-Politics

డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను తప్పించేందుకే కే‌సి‌ఆర్ బీజేపీతో పొత్తుకు సిద్దమౌతున్నారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్ష.అయితే ఈ విమర్శలను కొట్టి పారేయడానికి కూడా లేదు.ఎందుకంటే ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) లో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత.

అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర కమలనాథులు పదే పదే చెబుతూ వచ్చారు.కానీ ఏమైందో తెలియదు గాని ఈ లిక్కర్ కేసు ప్రస్తావన ప్రస్తుతం ఎక్కడ వినపడడం లేదు.

దీన్ని బట్టి చూస్తే బీజేపీతో అతర్గతంగా కే‌సి‌ఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

Telugu Amit Shah, Cm Kcr, Mlc Kavitha, Telangana, Ts-Politics

ఇదిలా ఉంచితే మూడు రోజులుగా డిల్లీ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్.హటాత్తుగా అమిత్ షా( Amit Shah ) తో బేటీ అయ్యారు.ఈ బేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండానే కామ్ గా సమావేశం అయ్యారు.

అయితే ఈ సమావేశంలో కే‌టి‌ఆర్ అమిత్ షా తో ఏం చర్చించారు.పొత్తుకు సంబంధించి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనే గుసగుసలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

గతంలో అమిత్ షా పై ఘాటైన విమర్శలు గుప్పించిన కే‌టి‌ఆర్ ఇప్పుడు బేటీ కావడం నిజంగా కొంత ఆసక్తికర పరిణామమే.అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టమే కాబట్టి.

బీజేపీ బి‌ఆర్‌ఎస్ మద్య పొత్తు కుదిరిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube