పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.నటుడు నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా ఇక్కడ తెరకెక్కుతుంది.
ఇక తెలుగులో కూడా ఈయనే డైరెక్ట్ చేయడం విశేషం.రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించడమే అందుకు కారణం అనే చెప్పాలి.ఈయన కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ ఈయన ఉండడంతో అంచనాలు పెరిగాయి.డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ ( devotional trendy entertainer )గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ తన పార్ట్ షూట్ ఎప్పుడో పూర్తి చేసుకున్నాడు.అలాగే ఈ మొత్తం షూట్ కూడా చివరి దశకు చేరుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి వరుస పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన టీమ్ ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ టీజర్ పై తాజాగా ఒక అప్డేట్ వైరల్ అవుతుంది.అతి త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారట.

ఈ టీజర్ నిముషం కంటే ఎక్కువ నిడివితో ఉంటుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్.మొత్తానికి టీజర్ పై ఒక క్లారిటీ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.చూడాలి ఎలాంటి ట్రీట్ అందిస్తారో.ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ( Priya Prakash Warrier, Ketika Sharma ) కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.







