కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.
నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.
వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం( Kohinoor Diamond, Peacock Throne ) తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ( Indian ) సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

ఇకపోతే.అమెరికాలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ సెంటర్‌లో( Ronald Reagan Center in Washington ) ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు నరేంద్ర మోడీ.ఈ సందర్భంగా విదేశాల్లో మగ్గుతున్న భారతీయ కళాఖండాల గురించి ప్రస్తావించారు.భారత్ నుంచి దొంగిలించబడిన 100కు పైగా పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందని మోడీ తెలిపారు.
ఇందుకు ఆ దేశ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుజ్జీంపజేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వున్న భారతీయ వస్తువులు, కళాఖాండాలను వెనక్కి తీసుకొస్తోంది.
పలు విదేశీ పర్యటనల సందర్భంగా మోడీ .ఈ విషయంపై ఆ దేశాధినేతలతో చర్చించారు.ఇప్పటి వరకు 251 పురాతన వస్తువులను భారతదేశానికి తిరిగి తీసుకొచ్చారు.2014 నుంచి 238 పురాతన వస్తువులు వెనక్కి తీసుకొచ్చారు.

గతేడాది దీపావళి సందర్భంగా 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించిన సంగతి తెలిసిందే.గత 2021 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు కలిసి ఈ హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్( Antony Blinken ) తెలిపారు.దక్షిణ భారతదేశంలోని ఓ ఆలయంలోంచి 500 ఏళ్ల నాటి ఈ హనుమాన్ విగ్రహాన్ని కొందరు దొంగిలించారు.అనంతరం దానిని ఖండాలు దాటించి అమెరికాలోని క్రిస్టీ ఆక్షన్ హౌస్‌కు విక్రయించారు.
దీనిని వేలానికి పెట్టగా.ఒక ఆస్ట్రేలియా పౌరుడు కొనుగోలు చేశాడు.







