సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక చాలా మంది టాలెంట్ బయటపడుతోంది.చిన్నపిల్లలనుండి ముసలివాళ్ళ వరకు ఎవరిలో దాగున్న టాలెంట్( Talent ) అయినా ఇట్టే బయటపడుతోంది.
పాటల నుండి డ్యాన్స్ వరకు విషయం ఏదైనా సరే కొంతమంది ఔత్సాహికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.ఇలా సోషల్ మీడియాలో పెట్టే ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.దానిని చూసిన నెటిజన్లు అయితే అవాక్కైపోయి మరీ చూస్తున్నారు.

వీడియోని ఒక్కసారి గమనిస్తే, తన ఇంట్లో ఉన్న సోఫాలపై ఆ చిన్నారి జిమ్నాస్టిక్స్ తరహాలో బ్యాక్ ఫ్లిప్స్( Back Flips ) వేయడం మనం చూడవచ్చు.ఒక చివరి నుంచి విన్యాసాలు మొదలు పెట్టిన ఆ చిన్నారి మరో చివరకు వచ్చి అక్కడ అద్భుతమే చేసింది.చూసే వాళ్లకి కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఫ్లిప్స్ వేసి ఔరా అనిపించింది.55 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ చిచ్చర పిడుగు ఏకంగా 82 బ్యాక్ ఫ్లిప్స్ వేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.ఈ ఫ్లిప్స్ వేస్తున్నప్పుడు శరీరం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా కీలకం.ఫ్లిప్స్ వేయడం ఎంత ముఖ్యమో చివర్లో ఎండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా రావాల్సి ఉంటుంది.

ఇంత చిన్న వయస్సులోనే ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లిప్స్ వేయడం పట్ల చాలా మంది ఆశ్చర్యం, హర్షం రెండు ఒకేసారి వ్యక్తం చేస్తున్నారు.ఈ చిన్నారి కాబోయే ఒలింపిక్ పార్టిసిపెంట్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.55 సెకన్లలో 82 ఫ్లిప్స్ వేయడం అంటే మాటలు కాదని నిపుణులు కూడా అంటున్నారు.ఇంక్రిడిబుల్ టాలెంట్ కొంతమంది పొగుడుతున్నారు.
అయితే ఈ వీడియో ఎవరు తీశారు, ఈ వీడియోలో ఉన్న ఆ చిన్నారి చిచ్చరపిడుగు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియదు.ఈ వీడియోను నేహా అగర్వాల్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేయగా ఈ వీడియోకు 179.9K వ్యూస్ వచ్చాయి.







