నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి.ప్రస్తుతం నిజామాబాద్ వరకూ విస్తరించిన నైరుతి రేపటి వరకు పూర్తిస్థాయిలో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఒడిశా – బెంగాల్ తీరాలకు దగ్గరలో నైరుతి దిశగా ఆవర్తనం వ్యాప్తించి ఉంది.
దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డితో పాటు యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.