తమిళనాడులోని( Tamil Nadu ) కోయంబత్తూరు జిల్లా వాడవల్లికి చెందిన షర్మిల( Sharmila ) ఇటీవల రాష్ట్రంలోనే తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా గుర్తింపు పొందింది.అయితే, ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
డీఎంకే ఎంపీ కనిమొళి,( DMK MP Kanimozhi ) ఆమెతో వచ్చిన వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ఈ డ్రైవర్ యజమాని ఆగ్రహానికి గురైంది.చివరికి జాబ్ కోల్పోయింది.
శుక్రవారం ఉదయం షర్మిలను రాజకీయ నాయకురాలు కనిమొళి స్వయంగా కలుసుకుని ఆమె సాధించిన ఘనతను కొనియాడారు.గాంధీపురం బస్టాండ్‌లో షర్మిల బస్సు ఎక్కిన ఎంపీ కనిమొళి పీలమేడుకు అందులోనే ప్రయాణించారు.ప్రయాణ సమయంలో, ట్రైనీ బస్ కండక్టర్ అన్నాతై కనిమొళిని, ఆమె సహచరులను టిక్కెట్లు కొనమని అడిగింది.అయితే షర్మిల మాత్రం వారు ఆల్రెడీ టిక్కెట్లు కొనేశారని, తమను డిస్టర్బ్ చేయొద్దని కండక్టర్ పై అరిచింది.
దాంతో సదరు కండక్టర్ ఈ ఘటనపై బస్సు యజమాని దురైకానుకు ఫిర్యాదు చేసింది.
ఈ సంగతి తెలుసుకున్న యజమాని షర్మిల, ఆమె తండ్రి మహేశ్ ఇద్దరినీ ఆఫీసుకు పిలిపించి, పబ్లిసిటీ కోసం తమ సంస్థకు నష్టాలు తేవద్దని చివాట్లు పెట్టారు.తాను ఎవరినీ ఆహ్వానించలేదని, ఎలాంటి ప్రచారం చేయలేదని షర్మిల వివరణ ఇచ్చినప్పటికీ, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.జాయిన్ అయిన ఎంతసేపటికే జాబ్ కోల్పోవడంతో షర్మిల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.తాను ఇప్పుడు ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఎక్కువ గంటలు పనిచేసినా రూ.1200 మాత్రమే సంపాదించగలనని వాపోయింది.ఇలా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని కన్నీరు మున్నీరయ్యింది.