ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించాలి, క్వాలిటీ విషయం లో అసలు తగ్గకూడదు అని అనుకునే అతి తక్కువ మంది యువ హీరోలలో ఒకడు నిఖిల్.( Hero Nikhil ) హ్యాపీ డేస్ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైనా నిఖిల్, ఆ చిత్రం లో రాజేష్ పాత్ర ద్వారా అందరికీ బాగా దగ్గరయ్యాడు.
ఆ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ తో నిఖిల్ కి వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ, ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలు దక్కలేదు.అలాంటి సమయం లో ‘స్వామి రారా’ చిత్రం ఆయన కెరీర్ ని ఒక కీలక మలుపు తిప్పింది.
ఈ సినిమా నుండి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆచి తూచి అడుగులు వేస్తూ అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో గా నిలిచాడు.ఇక గత ఏడాది ఆయన ‘కార్తికేయ 2 ‘ ( Karthikeya 2 ) చిత్రం తో టాలీవుడ్ ఆడియన్స్ ని మాత్రమే కాదు.
పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఆయన ‘స్పై’ చిత్రం తో ( Spy Movie ) వచ్చే వారం మన ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.నిఖిల్ మరో అద్భుతమైన కంటెంట్ తో మన ముందుకు రాబోతున్నాడు అని అందరూ అనుకున్నారు.
అయితే రీసెంట్ గా ఆయన ఈ చిత్ర నిర్మాతతో గొడవలు పడినట్టుగా వార్తలు వినిపించాయి.ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి నిర్మాతగా రాజశేఖర్ రెడ్డి( Producer Rajasekhar Reddy ) వ్యవహరించాడు.
ఆయన ఈనెల 29 వ తారీఖున విడుదల చెయ్యాలని అనుకున్నాడు, కానీ నిఖిల్ అందుకు ఒప్పుకోలేదు.ఎందుకంటే ఈ సినిమాని దేశం మొత్తం చూపించాలి అనేది నిఖిల్ భావన.
నిర్మాత అందుకు సిద్ధం గా లేదు, దీనితో నిఖిల్ ‘అయితే నేను డబ్బింగ్ చెప్పను.సినిమా ప్రొమోషన్స్ కి కూడా రాను’ అని తెగేసి చెప్పాడట.దీంతో నిర్మాతకు ఈ సినిమాని హిందీ లో డబ్ చెయ్యక తప్పలేదు.

ఇప్పుడు ఈ చిత్రం ఈనెల 29 వ తారీఖున తెలుగు మరియు హిందీ బాషలలో విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా హీరో నిఖిల్ దర్శక నిర్మాతలతో కలిసి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు.ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ ని విలేఖరులు ప్రశ్నలు అడుగుతూ ‘మీకు నిర్మాతకు మధ్య చాలా గొడవలు అయ్యాయట నిజమేనా’ అని అడగగా, దానికి నిఖిల్ సమాధానం చెప్తూ,’అవును నిజమే, నిర్మాత నేను తిట్టుకున్నాం , కొట్టుకున్నాం కూడా.
కానీ అదంతా కేవలం సినిమా కోసమే.ప్రేక్షకుడు రెండు గంటల అమూల్యమైన సమయం, మరియు ఖర్చు చేసి థియేటర్స్ కి వస్తారు.కాబట్టి క్వాలిటీ విషయం లో ఏమాత్రం తగ్గకూడదు అనేదే నా తాపత్రయం.అందుకే 29 వ తేదీన విడుదల చెయ్యొద్దు అని చెప్పాను, ఆ తర్వాత కూల్ గా మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకున్నాము, అందుకే ఈరోజు నేను మీ మధ్య ఇలా ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.







