మెగా ఫ్యామిలీ( Mega Family ) అండ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు సైతం రామ్ చరణ్( Ram Charan ) దంపతులకు ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని ఎదురు చూసారు.ఎందుకంటే వీరికి పెళ్లి జరిగి 10 ఏళ్ళు అవుతుంది.
మరి ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళకు వీరు గుడ్ న్యూస్ చెప్పడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో కోలాహలం మాములుగా లేదు.
మరి ఇన్ని ఎదురు చూపుల మధ్య ఈ రోజు ఎట్టకేలకు మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.జూన్ 20న రామ్ చరణ్ అండ్ ఉపాసన( upasana ) దంపతులకు పండండి ఆడబిడ్డ జన్మించింది.
ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు స్పందిస్తాడా అని ఎదురు చూసిన వారికీ ఇప్పుడు తెరపడింది.ఈయన ఎట్టకేలకు ఇప్పుడు స్పందించారు.

తాజాగా ఉపాసన అపోలో హాస్పిటల్( Apollo Hospital ) నుండి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చింది.ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడాడు.మా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది అని తాము అనుకున్న సమయానికి భగవంతుడు బిడ్డను ప్రసాదించాడని, పాపకు నా పోలికలే వచ్చాయని తెలిపారు.

అంతేకాదు పాపకు ఒక పేరు అనుకున్నాం అని.నేను, ఉపాసన కలిసి నిర్ణయించిన పేరు అది.పెట్టేరోజు తప్పకుండ చెబుతాం అని అప్పటి వరకు ఎదురు చుడండి అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.మొదటిసారి ప్రతీ తండ్రి బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలానే ఫీల్ అయ్యానని ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని అన్నాడు.







