తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు రోజులు హస్తినలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారని సమాచారం.అదేవిధంగా కంటోన్మెంట్ భూములు, మామునూర్ ఎయిర్ పోర్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది.
అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.