సాధారణ ఒక సినిమా చేసే సమయంలో దర్శకులు ఎన్నో విషయాలను గమనిస్తూ ఉండాలి కనుక ఒకానొక సమయంలో కాస్త నిరుత్సాహానికి ఆగ్రహానికి గురవుతూ ఇతరులపై కోపడటం సర్వసాధారణంగా జరిగే అంశం.అయితే కొంతమంది దర్శకులు సెలబ్రెటీలను ఇష్టానుసారంగా తిట్టడమే కాకుండా చేయి కూడ చేసుకుంటారని సంగతి మనకు తెలిసిందే.
ఇలా దర్శకుల గురించి సెలబ్రిటీలు మాట్లాడుతూ ఫలానా దర్శకుడు నుంచి మేము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామంటూ చెబుతూ ఉంటారు.తాజాగా కోలీవుడ్ నటుడు ఉదయనిది స్టాలిన్ ( Udhayanidhi Stalin )డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మారి సెల్వరాజ్ ( Mari Selvaraaj ) టెన్షన్ పార్టీ అంటూ ఉదయనిది స్టాలిన్ వెల్లడించారు.ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఉదయనిది స్టాలిన్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన చిత్రం మామన్నన్ ( Maamannan ).ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో ఉదయనిది స్టాలిన్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈయన సినిమా షూటింగ్ లొకేషన్లో ఉంటే కనుక చాలా కంగారు పడుతూ ఉంటారని.కంగారు కారణంగానే అసిస్టెంట్ డైరెక్టర్లను ఇష్టానుసారంగా తిట్టడమే కాకుండా వారిపై చేయి కూడా చేసుకుంటారంటూ తెలియజేశారు.ఈ విధంగా డైరెక్టర్ గురించి హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వంద చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి దర్శకులు కూడా ఆర్టిస్టులపై చేయి చేసుకోరు అయితే మూడో సినిమాకే ఇలా అసిస్టెంట్లపై చేయి చేసుకోవడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







