ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా( Vespa ) ఆకట్టుకునే డిజైన్, కలర్స్‌తో ఆడవారికి బెస్ట్ స్కూటర్లను అందిస్తోంది.ఇప్పుడు ఈ కంపెనీ మిక్కీ మౌస్ స్ఫూర్తితో తమ స్కూటర్ల ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించడానికి డిస్నీతో జతకట్టింది.
వెస్పా ప్రైమవేరా మోడల్ స్కూటర్లలో డిస్నీ మిక్కీ మౌస్ ఎడిషన్‌ను( Disney Mickey Mouse Edition ) కంపెనీ తీసుకొస్తోంది.ఈ డిస్నీ మిక్కీ మౌస్ ఎడిషన్ 50cc, 125cc, 150cc మోడళ్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ స్కూటర్ల బుకింగ్స్ మరికొద్ది వారాల్లో మొదలవుతాయి.
వెస్పా ప్రైమవేరా స్కూటర్లు నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు వంటి రంగులు ఉంటాయి.
ఇవి మిక్కీ మౌస్ క్యారెక్టర్‌లో ఉండే ఐకానిక్ కలర్స్. స్కూటర్‌లోని పసుపు చక్రాలు మిక్కీ బూట్లను పోలి ఉంటాయి.
నలుపు అద్దాలు దాని గుండ్రని చెవులను పోలి ఉంటాయి.స్కూటర్ ముందు భాగంలో మిక్కీ మౌస్ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేస్తారు.
సీటు, ముందు షెల్‌పై మిక్కీ మౌస్( Mickey Mouse ) అని రాసి ఉంటుంది.అదనంగా, అదే రంగులలో మ్యాచ్ అయ్యే హెల్మెట్ స్కూటర్‌తో పాటు వస్తుంది.

వెస్పా ప్రైమవేరా దాని సామర్థ్యం, పనితీరుకు ప్రసిద్ధి చెందిన i-get అనే మోడర్న్ ఇంజన్‌తో వస్తుంది.ఇది ఎల్ఈడీ లైటింగ్, రిమోట్ సీట్ ఓపెనర్, బైక్ ఫైండర్, వెస్పా MIA యాప్‌కు కనెక్ట్ అయిన 4.3-అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది.వెస్పా వాల్ట్ డిస్నీ కంపెనీ 100 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి ఈ మిక్కీ మౌస్ ఎడిషన్ లాంచ్ చేస్తుంది.

అయితే, ఈ ప్రత్యేక ఎడిషన్ కొన్ని యూరోపియన్ మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇది లాంచ్ కావడం లేదు.రీసెంట్‌గా పియాజియో ఇండియాలో వెస్పా డ్యూయల్‌ని పరిచయం చేసింది.ఇది 125cc, 150cc ఇంజన్‌లతో అందుబాటులో ఉంది.ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ డిజైన్‌తో, నాలుగు కలర్ ఆప్షన్స్‌లో ఇది వస్తుంది.ధరలు VXL వేరియంట్లకు రూ.1.32 లక్షలు, SXL వేరియంట్లకు రూ.1.37 లక్షల నుంచి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్).