ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక కిషన్( Pilli Renuka Kishan ) అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ అధ్యక్షతన గురువారం జరిగింది.

 Formation Of Telangana State Is The Result Of Six Decades Long Struggle And Sacr-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమర వీరుల పేరిట తాత్కాలిక స్థూపం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించి స్థూపం ఎదుట తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్యమంలో అమరులైన అమరులకు ఎంపిపి పిల్లి రేణుక కిషన్ తో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని, అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు.ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని ఎంపిపి గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆమే అన్నారు.

అనంతరం ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి.తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర రూపకర్త అమరులు ప్రోపేసర్ జయశంకర్ సార్ పోరాటాలను వారు కొనియాడారు, తెలంగాణ కోసం అమరులైన జయశంకర్ సార్, కలోజీ నారాయణ,కాసోజ్ శ్రీ కాంత్ చారి , పోలీస్ కిష్టయ్య, యాదయ్య ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో చిరంజీవి , సూపరింటెండెంట్ శ్రీ నివాస్ , వ్యవసాయ అధికారి భూమి రెడ్డి , ఎంపీటీసీ సభ్యులు ఎలగందుల అనసూయ నర్సింలు, వరద బాబు, సిరిసిల్ల మధు , కొత్తపల్లి పద్మ దేవయ్య , మండల పరిషత్ అధికారులు సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, నరేందర్ గౌడ్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube