ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( Whatsapp )మంచి దూకుడుమీద వుంది.ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లలో వాట్సప్ ఒకటనే విషయం అందరికీ తెలిసినదే.
గత కొన్నాళ్లుగా చూసుకుంటే వాట్సాప్ యూజర్లకు ఎదురవుతున్న పలు సమస్యలను తీర్చి దిద్దే విధంగా పలు కీలకమైన ఫీచర్స్ ను విడుదల చేస్తూ వస్తోంది.గతంలో వాట్సప్ వినియోగదారులు అంతర్జాతీయ స్కామ్ కాల్స్ తో ఇబ్బంది పడడంతో ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం( Central Govt ) స్పందించడం అందరికీ తెలిసినదే.
దీంతో వాట్సాప్ సంస్థ వెంటనే ఆ సమస్యకి చెక్ పెట్టడానికి రంగంలో దిగింది.

అవును, వాట్సాప్ విడుదల చేసిన ఈ ఫీచర్ మీ మొబైల్లో కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్ల నుంచి ఫోన్ వచ్చినప్పుడు అలెర్ట్ అవుతుంది.తద్వారా ఆ కాల్ సైలెంటు అయిపోతుంది.అంటే వాట్సప్ కాల్ వచ్చినా కూడా అది మీకు తెలియని తెలియదు.
ఈ ఫీచర్ను మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్( Mark Zuckerberg ) తన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వేదికగా తెలియజేసారు.ఆండ్రాయిడ్, IOS వంటి వాటిలో ఈ ఫీచర్ ను అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ వినియోగదారులు తమ వ్యక్తిగత భద్రతను పరీక్షించడం కోసమే ఈ ఫీచర్ ఉద్దేశమని తెలుస్తోంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే గుర్తుతెలియని వ్యక్తుల నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు అందులో స్కామ్ స్పామ్ కాల్ ఈ ఫీచర్ గుర్తిస్తుంది.ఇదెలా పనిచేస్తుందంటే, దీని ద్వారా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తే మొబైల్ రింగ్ అవ్వదు.కేవలం వారి నెంబర్లు మాత్రమే వాట్సప్ కాల్ వివరాలలో చూపిస్తుంది.
అయితే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్లి ప్రైవసీ పైన క్లిక్ చేయాలి.తరువాత అక్కడ కనిపించిన కాల్స్ ఆప్షన్ పైన టాప్ చేయాలి.
ఆ తరువాత సైలెన్స్ అన్నోన్ కలర్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.అంతర్జాతీయ స్కామ్ స్పామ్ కాల్స్ వల్ల వాట్స్అప్ వినియోగదారులు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.







