సుమంత్( Sumanth ) హీరోగా సంతోష్ జగర్లపూడి( Santhosh Jagarlapudi ) డైరెక్షన్ లో వారాహి అనే ఒక సినిమా కొద్దిరోజుల క్రితమే పూజ కార్యక్రమాలు జరుపుకొని షూటింగ్ చేయడానికి జరుపుకుంటుంది.రీసెంట్ గా వచ్చి మంచి పేరు సంపాదించుకున్న రంగ మార్తాండ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశీ లో చాలా భారీ ఎత్తున జరగుతుంది అనే విషయం అయితే తెలుస్తుంది…ఇక ఈ సినిమా లో సుమంత్ తను ఇంతకు ముందు చేసిన సినిమాలకంటే కూడా బిన్నంగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మరియు చాలా ట్విస్టుల మధ్య సాగుతుంది అనేది తెలుస్తుంది…ఇక ఈ సినిమా టైటిల్ వారాహి ( Varahi )కావడం తో ఈ టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది అంటూ ఇప్పటికే చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…వారాహి అంటే అందరికీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారం కోసం తీసుకున్న వెహికిల్ గుర్తుకు వస్తుంది…కానీ ఈ సినిమా టైటిల్ ని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెహికిల్ రావడం కంటే ముందే ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించారు మేకర్స్.

అయితే డైరెక్టర్ సంతోష్ జగర్లపూడి సుమంత్ కాంభినేషన్ లో ఇప్పటికే సుబ్రమణ్య పురం అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అందుకే సుమంత్ ఈయన కి మరో ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ సినిమా తో ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…డైరెక్టర్ సంతోష్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లను చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అనే విషయం ఆయన తీసిన మొదటి సినిమా తోనే అందరికీ తెలియజేశాడు.ఇక ఈ సినిమా యూనిట్ మొత్తం ప్రస్తుతం కాశీ షెడ్యూల్ షూట్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ జనరేషన్ లో దేవుడికి సంభందించిన సినిమాలు చాలా తక్కువ గా వస్తున్నాయి.ఈ సినిమా ద్వారా జనానికి ఒక దేవుడి కి సంభందించిన కథ చెప్పబోతున్న డైరెక్టర్ సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి.
ఈ సినిమా పెద్ద హిట్ అయి అటు సుమంత్ కి ఇటు డైరెక్టర్ సంతోష్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం.








