రామ్ చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) దంపతులకు కుమార్తె పుడితే ఆ విషయాన్ని కవర్ చేయడానికి డజన్ల కొద్దీ కెమెరాలు వేసుకొని చిన్న పెద్ద టీవీ చానెల్స్, సోషల్ మీడియా ఛానెల్స్ వెళ్లి కవర్ చేసిన పిక్ ఒకటి నిన్నటి నుంచి వైరల్ అవుతుంది.ప్రపంచంలో ఎవరు పిల్లలను కననట్టు ఉపాసన రామ్ చరణ్ మాత్రమే ఎదో అతీతమైన పని చేసినట్టు మీడియా కవర్ చేసే విధానం పై అనేక విమర్శలు వచ్చాయి.
ఉపాసన గర్భవతి అయ్యింది మొదలు ఆమె ఏం తింటుంది, ఎలా తింటుంది, ఎవరు పుడతారు, పుడితే ఏం పేరు పెడతారు అంటూ లైవ్ లో డిబేట్స్ చేసే చెత్త స్థాయికి మన మీడియా దిగజారి పోయింది.

సరే మీడియా దిగజారిపోయింది .అంత ఒప్పుకుంటున్నారు.కానీ తప్పంతా మీడియా ది మాత్రమేనా.
ప్రేక్షకులు, మామూలు ప్రజలు అంత సంసారులా అంటే అస్సలు కాదు.సామాన్య ప్రజానీకం ఈ వార్తలను నోరెళ్ళ బెట్టుకొని చూస్తుంది కాబట్టి, ఆ సదరు వార్తలకు మంచి వ్యూస్ పడి రేటింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చానెల్స్ కూడా పని గట్టుకొని ఇలాంటి సీవరేజీలు చేస్తున్నాయి.
అది కూడా వదిలేద్దాం.ఎవరైనా మాములు చిన్న స్థాయి నటుడు కనిపిస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సెల్ఫీ తీసుకోరా ? సినిమా తారల పిల్లలలు చదువుతున్న స్కూల్స్ మరియు కాలేజెస్ లోనే మన పిల్లలను చేర్చాలని విశ్వా ప్రయత్నాలు చేయడం లేదా ? దిక్కుమాలిన విడాకులు, కూలిపోయే కాపురాలు వార్తలను ఎగబడి చూడటం లేదా .

ఆ నటి అక్కడ దొరికింది… ఈ హీరోయిన్ అతడితో మీడియా కంటికి చిక్కింది…ఆ తార తేరా చాటు బాగోతం… పాలనా హీరోయిన్ విడాకులు … ఇవే కదా మనకు కావాల్సిన, ఆనందాన్ని ఇచ్చే వార్తలు.ఇక దిగజారి థంబ్నెయిల్స్ పెట్టె యూట్యూబ్ చానెల్స్ గురించి మాట్లాడుకోక పోవడమే ఉత్తమం.ఇక ఇంకో దరిద్రం ఏంటంటే ఒక హీరో కి కొడుకు పుడితే వాడికి ఒక బాబు ని జత చేసి లేదా బుల్లి స్టార్ అంటూ పిలిచేది మన అభిమాని కదా.? ఇక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే చాలు కుళ్ళు కామెడీ చేసే జబర్దస్త్ బ్యాచ్ ని పిలిపించి మరి కామెడీ చేయించేది ఎవరు ? ముందు మనం మారి అప్పడు మీడియా కు వాతలు పెడదాం.యథా మీడియా తథా ప్రేక్షకా.!
.






